Syria: సిరియా టార్టస్ ప్రావిన్స్ లో ఘర్షణలు..! 12 d ago
సిరియాలో జరిగిన ఘర్షణలో 17 మంది మృతి చెందారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ప్రభుత్వంలో ఓ అధికారిని అరెస్టు చేసేందుకు రెబల్స్ ప్రయత్నించగా ఘర్షణలు జరిగాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం, అసద్ ప్రభుత్వంలో సైనిక న్యాయ విభాగం డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తిపై అన్యాయంగా మరణశిక్ష విధించారని ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వంలోని జనరల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌లో 14 మంది, ఖిర్బెత్లో 3 సాయుధులు మృతి చెందారు.